రాజమౌళి తండ్రి మరోమారు మెగా ఫోన్ పట్టనున్నాడా?

Published on May 26, 2020 2:22 pm IST

దేశవ్యాప్తంగా దర్శకుడిగా రాజమౌళికి ఎంత పేరుందో స్టోరీ మరియు స్క్రీన్ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ కి అదే స్థాయి పేరుంది. బాహుబలి, మెర్సల్, భజరంగీ భాయ్ జాన్ వంటి అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన రచించినవే. ఇక రాజమౌళి సినిమాలకు కథా రచయితగా ఉండే ఆయన ఆర్ ఆర్ ఆర్ కథను కూడా అందించడం జరిగింది. ఐతే దర్శకుడిగా మాత్రం ఆయన విజయవంతం కాలేదు. ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు నాలుగు చిత్రాల రాగా నాలుగు పరాజయం పొందాయి.

మరో మారు దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ యంగ్ హీరో కోసం ఆయన ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఆ కథను ఆయన స్వయంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ సారైనా దర్శకుడిగా విజయం అందుకుంటాడేమోచూడాలి. అర్థాంగి, శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ ఆయన గతంలో దర్శకుడిగా పని చేసిన చిత్రాలు.

సంబంధిత సమాచారం :

More