తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బిగిల్’. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇందులో విజయ రహస్యం మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎంతో లావిష్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ గురించి ఇన్నాళ్లు ఏవేవో వార్తలు వినిపించినా ఇప్పుడు అసలు వ్యయం ఎంతో బయటకు వచ్చింది.
తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర బడ్జెట్ రూ.180 కోట్లని తెలుస్తోంది. ఇది విజయ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం. అంతేకాదు శంకర్, రజనీల ‘2 పాయింట్ 0’ తర్వాత రెండవ అతిపెద్ద తమిళ చిత్రం కూడా ఇదే. ఏజిఎస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానయకిగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. ఈ దీపావళికి సుమారు 400 థియేటర్లలో ఈ చిత్రం విడుదలకానుంది.


