స్టార్ హీరో సినిమాను చుట్టుముట్టిన వివాదం

స్టార్ హీరో సినిమాను చుట్టుముట్టిన వివాదం

Published on Sep 25, 2019 1:30 AM IST

Vijay2

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బిగిల్’. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అలాంటి ఈ సినిమాను తాజాగా ఓ వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ కత్తి గుచ్చి ఉన్న ఒక చెక్క మొద్దుపై కాలు పెట్టి కూర్చున్న స్టిల్ ఉంది. ఇదే వివాదానికి కారణమైంది.

విజయ్ అలా చెక్క మొద్దు మీద కాలు పెట్టడాన్ని మత్స్య, మాంస వ్యాపార సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆ చెక్క మొద్దు, కత్తి తమకు దైవంతో సమానమని, పనిలోకి దిగేముందు వాటికి నమస్కరించే దిగుతామని, అలాంటి వాటిని విజయ్, అట్లీ అవమానించారని అంటూ కోవై కలెక్టర్ కార్యాలయంలో పిర్యాధు చేశారు.

దీని గురించి విజయ్‌కు, ఆ చిత్ర దర్శకుడు అట్లీకీ, నిర్మాణ సంస్థ ఏజీఎన్‌కు నోటీసులు పంపామని, ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని, లేకుంటే దేశ వ్యాప్తంగా మత్స్య, మాంసం వ్యాపారులతో నిరసనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు