లేటెస్ట్..చెన్నై ఫ్యాన్స్ ఫేవరెట్ లైన్ తో “గోట్” ఫస్ట్ సింగిల్ కి టైం లాక్

లేటెస్ట్..చెన్నై ఫ్యాన్స్ ఫేవరెట్ లైన్ తో “గోట్” ఫస్ట్ సింగిల్ కి టైం లాక్

Published on Apr 14, 2024 12:45 PM IST


ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2024) క్రికెట్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి ఉండే క్రేజ్ ఏపాటిదో కూడా అందరికీ తెలుసు. ఒక్క తమిళ నాట జనం అని కాదు కానీ ఎం ఎస్ ధోని (MS Dhoni) మూలాన ఈ ఫ్రాంచైజ్ కి ఈ రేంజ్ క్రేజ్ వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి ఈ ఫ్రాంచైజ్ నుంచి ఫేవరెట్ ట్యాగ్ “విజిల్ పోడు” (Whistle Podu) అనేది బాగా పాపులర్ మరి ఈ లైన్ తోనే దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” ఫస్ట్ సింగిల్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఈ అనౌన్సమెంట్ చూసిన ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

పైగా ఇవాళ చెన్నై మ్యాచ్ (CSK vs MI) కూడా ఉండడం విశేషం. దీనితో ఈ ఫస్ట్ సింగిల్ కి మరింత ప్లస్ అని చెప్పాల్సిందే. మరి తమిళనాడు కొత్త సంవత్సరం కానుకగా వస్తున్న ఈ సాంగ్ ని విజయ్ ఆలపించాడు మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు