సూపర్‌స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా… ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ‘హీరో కృష్ణనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేశారు. నా మొదటి హీరో కృష్ణ. ఆంటి విజయనిర్మలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. నా సక్సెస్ పుల్ జీవితానికి కృష్ణనే అని గర్వంగా చెప్పుకుంటా. మహేశ్ బాబు సినిమాతో రీ ఎంట్రీ అనేది ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ కొడుకుతోనూ నటిస్తా. మూడు జనరేషన్ల హీరోలతో సినిమా చేసినట్టు అవుతుంది. మహేశ్ 24 కేరక్టర్ బంగారం. ఒక్క మాటలో చెప్పాలంటే జెంటిల్‌మెన్. సూపర్ స్టార్ అనే పదానికి అర్థం మహేశ్. అంచెలంచెలుగా ఎదగడం, ఒదగడం, నేర్చుకోవడం, మీ అభిమానాన్ని సంపాదించడం మహేశ్ కంటే మించిన వారు లేరని అనుకుంటున్నా. కొత్తదనం కావాలని ప్రతి సినిమాకు నేర్చుకుంటూ వచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబేనా నటించింది అనే ఆశ్చర్యం కలుగుతోంది అని అన్నారు.


