వరల్డ్ రికార్డు పై కన్నేసిన స్టార్ హీరో

వరల్డ్ రికార్డు పై కన్నేసిన స్టార్ హీరో

Published on Aug 2, 2019 7:03 AM IST

తమిళ పరిశ్రమలో స్టార్ డమ్ చట్రం లో ఇరుక్కోకుండా కథను నమ్మి సినిమాలు చేసే అతి కొద్దిమంది హీరోలలో విక్రమ్ ఒకరు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వైవిధ్యం కొరకు తపిస్తారాయన. చివరకు పాత్ర కొరకు శరీరాకృతిని మార్చుకోగల దిట్ట.’ఐ’ చిత్రం కొరకు పరిమితి కి మించి బరువు తగ్గి సినిమా కొరకు ప్రాణాలు పణంగా పెట్టాడు.
ఈయనకు స్ఫూర్తి లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ వేసిన విభిన్న గెటప్స్ , చేసిన ప్రయోగాలు మనకు తెలిసి ఇండియా లోనే కాదు, ప్రపంచం లోనే ఎవరు చేసి వుండరు. సినిమాను వ్యాపారంగా కాకుండా కళగా భావించే స్టార్ హీరో కమల్.
ఐతే విక్రమ్, కమల్ రికార్డుని బద్దలు కొట్టడానికి రెడీ అయ్యారు. దశావతారం చిత్రంలో కమల్ ఏకంగా 10 విభిన్న గెటప్స్ లో కనిపించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు విక్రమ్ అంతకు రెట్టింపుకు పైగా, పాత్రలలో కనిపించనున్నారని సమాచారం.

అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో విక్రమ్ 58 వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రంలో ఏకంగా 25 విభిన్న గెట్ అప్స్ లో కనిపించనున్నారట. ఓ ప్రముఖ అమెరికన్ కంపెనీ ఇప్పటికే ఆయన గెటప్స్ కి సంభందించిన డిజైన్స్ రెడీ చేస్తుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం రాయడం జరిగింది. ఇదే కనుక జరిగితే ఒక చిత్రంలో ఇన్ని గెటప్స్ లో నటించిన నటుడిగా విక్రమ్ రికార్డు సృష్టించడం ఖాయం.

7స్క్రీన్‌ స్టూడియోస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్‌ 2020లో విడుదల చేయాలని చూస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు