రవితేజ సినిమాలో కీలక పాత్రలో విక్రమ్ జీత్ !

శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం దాదాపు అమెరికాలోనే జరగనుంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ ,మూవీ లో విక్రమ్ జీత్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విక్రమ్ జిత్ ‘పైసా వసూల్’ సినిమాలో నటించడం జరిగింది.

మూడు డిఫరెంట్ లూక్స్ లో రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నాడు. ‘నీకోసం, వెంకి, దుబాయ్ శ్రీను సినిమాల’ తరువాత రవితేజ శ్రీనువైట్ల కలిసి పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఇదే అవ్వడంతో ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి.