సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో మేనల్లుడు !
Published on Mar 13, 2018 3:25 pm IST

స్టార్ హీరో హీరోయిన్ల కుమారులు, కుమార్తెలు, బంధువుల పిల్లలు వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ రంగంలోకి ప్రవేశించడం మామూలు విషయమే. అలా వంశపారపర్యంగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్నారు కూడ. ప్రస్తుత విషయానికొస్తే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సోదరి కుమారుడు అర్జుమాన్ తెరంగేట్రానికి సిద్ధమవుతున్నారు.

అయితే ఇతని సినిమా ఎప్పుడు ఉంటుంది, దర్శకుడెవరు, మొదటి సినిమాగా అతను ఎలాంటి కథను చేస్తాడు అనే పూర్తి విషయాలు ఇంకా తెలియరాలేదు. ఇకపోతే విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కూడ హీరోగా ఎంట్రీ ఇస్తూ బాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook