
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఐ’. ఈ సినిమాని తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ బిజీగా ఉన్న ఈ సినిమాలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం ‘ఐ’ సినిమాలో విక్రమ్ – అమీ జాక్సన్ కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంటుందని, అలాగే సినిమాకి వన్ అఫ్ ది హైలైట్ అవుతుందని అంటున్నారు. శంకర్ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా అందరూ ఆశ్చర్యపోయేలా ఈ మూవీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. అలాగే ఈ సినిమాలో విక్రమ్ పలు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పిసి శ్రీరాం సినిమాటోగ్రాఫర్.