శంకర్ – విక్రమ్ ‘ఐ’ తెలుగు టైటిల్ కూడా ‘ఐ’

శంకర్ – విక్రమ్ ‘ఐ’ తెలుగు టైటిల్ కూడా ‘ఐ’

Published on Sep 14, 2014 10:44 PM IST

i-poster
సౌత్ ఇండియన్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్ – విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఐ’. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేయనున్నారు. మొదట ఈ సినిమాని తెలుగులో ‘మనోహరుడు’ టైటిల్ తో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు టైటిల్ ని కూడా ‘ఐ’ గా మార్చినట్టు ఈ చిత్ర టీం తెలియజేసింది.

ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సుమారు 30 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం రేపు చెన్నైలో భారీ ఎత్తున జరగనుంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ హాజరు కానుండగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు.

ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేయడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని తలపించేలా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ని ప్లాన్ చేసారు. విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు