పవర్ ఫుల్ గా విక్రమ్ “వీర ధీర సూరన్” టీజర్!

పవర్ ఫుల్ గా విక్రమ్ “వీర ధీర సూరన్” టీజర్!

Published on Apr 17, 2024 10:28 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ హీరో తదుపరి పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తంగలాన్ (Tangalaan) మూవీ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ హీరో తదుపరి మూవీ చియాన్ 62(Chiyaan62) కి సంబందించిన టైటిల్ టీజర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

వీర ధీర సూరన్ టైటిల్ ను ఖరారు చేస్తూ, టీజర్ విడుదల అయ్యింది. రిలీజ్ చేసిన వీడియో పవర్ ఫుల్ గా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సు అరుణ్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. దుషర మరొక కీలక పాత్రలో కనిపించనుంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు