సింధు బ్యాడ్మింటన్ కోచ్ గా సోనూసూద్

Published on Jun 2, 2019 5:26 pm IST

స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు జీవిత చరిత్ర త్వరలో తెలుగు సినిమా తెరపైకి రానుంది. సింధు బయో పిక్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు చిత్ర యూనిట్. విశేషం ఏమిటంటే ఈ మూవీని క్రేజి విలన్ సోనూ సూద్ స్వయంగా నిర్మించనున్నారు. దానితో పాటు ఈ మూవీలో ఓ ముఖ్యపాత్ర ఆయన చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

పి వి సింధు విజయాలలో ముఖ్య పాత్రపోషించిన ఆమె కోచ్ పుల్లెల గోపి చంద్ పాత్ర చేయడానికి ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారంట. బేసిక్ గా మంచి ఫిసిక్ ని కలిగిఉండే సోను సూద్ కోచ్ పాత్రకి చక్కగా సరిపోతాడు. ఈ మూవీలో సింధుగా ఎవరు నటిస్తారు. దర్శకత్వం, మ్యూజిక్ వంటి విషయాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇప్పటికే మరో స్టార్ బాడ్మింటన్ క్రిడాకారిణి సైనా నెహ్వాల్ బయో పిక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More