మార్చిలో విమలా రామన్ కులుమనాలి

మార్చిలో విమలా రామన్ కులుమనాలి

Published on Feb 16, 2012 11:22 AM IST


విమలా రామన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘కులు మనాలి’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మార్చి రెండవ వారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేగేశ్న సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బోపన్న చంద్రశేఖర్ నిర్మాత. ఈ చిత్రంలో కృష్ణుడు, శశాంక్ మరియు సమీక్ష ఇతర పాత్రల్లో నటించారు. ఇంతకు ముందెన్నడూ చూడని లోకేషన్లలో లోకేషన్లలో చిత్రీకరించినట్లు దర్శకుడు సతీష్ చెబుతున్నారు. శ్రీ వసంత్ సంగీతం అందించగా శివకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు