‘వినయ విధేయ రామ’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 14, 2019 12:23 pm IST

‘ధృవ’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్ట మొదటిసారి ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ లాంటి ఎందరో పేరున్న నటీనటులు నటించన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య విడుదలై బాడ్ టాక్ ను తెచ్చుకుంది.

కాగా నైజాం ఏరియాలో ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ 5.09 కోట్లు మరియు సెకెండ్ డే 1.72 కోట్లు, ఆదివారం నాడు 1.54 కోట్ల రూపాయలు వసూలు చేసి, మొత్తం మూడు రోజుల కలిపి రూ. 8.35 కోట్లను కలెక్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :

More