వైరల్: ‘లెనిన్’ సక్సెస్ ని చరణ్ కి అంకితమిచ్చేసిన అఖిల్!

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం “పెద్ది” అలాగే అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా చిత్రం “లెనిన్” కూడా ఒకటి. అయితే రామ్ చరణ్ కి అఖిల్ కి ఎంత ఉంది అనేది అందరికీ తెలిసిందే.

అఖిల్ తనకంటే చిన్నవాడే అయినప్పటికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ని మించిన అనుబంధం వారి నడుమ ఉంది. ఇలా లేటెస్ట్ గా అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రామ్ చరణ్ తన హార్ట్, ప్రాణం అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా పెద్ది సినిమాలో తన పెర్ఫామెన్స్ అమోఘం అని కొనియాడాడు.

అలానే తనలాంటి బిగ్ స్టార్ పెద్ది లాంటి సినిమాలు చేయడమే తనలాంటి యంగ్ జెనరేషన్ హీరోలకి స్ఫూర్తి అని అలానే తన లెనిన్ సినిమా సక్సెస్ ని రామ్ చరణ్ కి అంకితం ఇస్తున్నానని చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్ నడుమ ఎంతగానో వైరల్ అయ్యింది. అలానే రామ్ చరణ్ పట్ల అఖిల్ కి ఉన్న అభిమానం ఎంత అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది.

Exit mobile version