పవన్ కోసం అకిరా “అనిమల్” సాంగ్ వైరల్.!

పవన్ కోసం అకిరా “అనిమల్” సాంగ్ వైరల్.!

Published on Jan 17, 2024 7:05 AM IST

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు చిత్రాలు సహా తన పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి పవన్ తన పర్శనల్ లైఫ్ కి సంబంధించి అయితే తన విషయంలో కానీ అటు అన్నయ్య కుటుంబం తో కానీ కనిపించేది చాలా తక్కువే ఉంటుంది. ఇక పవన్ వారసుడు అకిరానందన్ కూతురు ఆద్య లతో ఈమధ్య కాలంలో కనిపించింది లేదు. కానీ వారు మాత్రం వారి పెదనాన్న ఇంట్లో ఏ శుభకార్యం అయినా కూడా కనిపిస్తారు.

మరి అలా రీసెంట్ గా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనగా అకిరా తనలోని మ్యూజిక్ టాలెంట్ ని చూపించడం రేణు దేశాయ్ ఇన్స్టా లో షేర్ చేసుకున్నారు. కానీ ఒరిజినల్ ఆడియో ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అనిమల్ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ ‘నాన్న నువు నా ప్రాణం’ అనే సాంగ్ ని తను కంపోజ్ చేయడం వైరల్ గా మారింది. పవన్ కోసం తాను ఈ సాంగ్ అక్కడ ప్లే చేసాడు అంటూ పవన్ ఫ్యాన్స్ లో ఈ బ్యూటిఫుల్ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు