వైరల్ : దిశా పేరుతో టైగర్ ని ఆడుకున్న అక్షయ్.!

వైరల్ : దిశా పేరుతో టైగర్ ని ఆడుకున్న అక్షయ్.!

Published on Mar 26, 2024 11:22 PM IST

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో బాలీవుడ్ యాక్షన్ హీరోస్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) అలాగే టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) లు హీరోలుగా మానుషీ చిల్లర్, అలయ ఎఫ్ అలాగే సోనాక్షి సిన్హా లు హీరోయిన్స్ గా నటించిన భారీ యాక్షన్ చిత్రం “బడే మియా చోటే మియా” (Bademiyan Chotemiyan).

మరి దర్శకుడు అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ని చేస్తూ ఈ ఏడాది ఈద్ కానుకగా అయితే రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఇక ఈ భారీ చిత్రం లేటెస్ట్ ప్రమోషన్స్ లో అయితే అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

టైగర్ నువ్వు ఎప్పుడూ ఒకే ‘దిశ’ లోనే ఉండాలి వేరే విధంగా డీవియేట్ అవ్వకు అంటూ హిందీలో ఓ ప్రెస్ మీట్ లో అన్నాడు దీనితో అంతా ఎవరికోసం అన్నారో అర్ధం చేసుకొని అక్కడ ఒక్కసారిగా నవ్వసాగారు.

దీనికి టైగర్ కూడా నవ్వుతూ కవర్ చేసాడు. దీనితో ఈ ఫన్ మూమెంట్ తాలూకా క్లిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రంలో “సలార్” (Salaar) నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithvi Raj Sukumar) విలన్ గా నటించగా ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు