వైరల్ : తన చిట్టి ఫాలోవర్ తో అల్లు అర్జున్ క్యూట్ వీడియో.!

వైరల్ : తన చిట్టి ఫాలోవర్ తో అల్లు అర్జున్ క్యూట్ వీడియో.!

Published on Nov 30, 2023 10:10 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూట్ లో తాను ఇప్పుడు బిజీగా ఉండగా తాను తాజాగా తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల నిమిత్తం తన ఓటు హక్కుని కూడా వినియోగించడం జరిగింది. అయితే తాను ఓట్ వేసినట్టుగా తన సోషల్ మీడియా నుంచి పోస్ట్ చేయగా ఆ పిక్ వైరల్ గా మారింది.

అయితే దీనితో పాటుగా ఓ వీడియో కూడా బన్నీపై వైరల్ గా మారింది. తాను ఓ చిన్నారితో మాట్లాడుతూ ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆమెకి ఇంకా ఎక్కువమంది ఫాలో అవ్వండి అంటూ ఆమె తరపున మాట్లాడడం బన్నీ ఉదారతను చూపింది. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఆమె తన ఇన్స్టా ఐడిలో ఈ వీడియో షేర్ చేసింది. మరి ఈ వీడియోలో అసలు బన్నీ ఆ చిన్నారి ఏం మాట్లాడుకున్నారో చూడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు