వైరల్ : “వీరమల్లు” నుంచి తన డైలాగ్ రివీల్ చేసిన బాబీ డియోల్

వైరల్ : “వీరమల్లు” నుంచి తన డైలాగ్ రివీల్ చేసిన బాబీ డియోల్

Published on Nov 28, 2023 12:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ పలు కారణాల చేత ఆలస్యం అవుతూ వస్తుంది.

అయితే కొన్ని విరామాలు తర్వాత గ్రాండ్ క్యాస్టింగ్ తో రీస్టార్ట్ అవుతూ వస్తున్నా ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో తనది ఓ డైలాగ్ చెప్పడం ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

తాను తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను అని అందులో ఒక డైలాగ్ గుర్తుంది. ‘బాద్షా బేగం మా ప్రాణం, మా ప్రాణాలు కాపాడు నీకేం కావాలో కోరుకో’ అంటూ తెలిపాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఇప్పుడు ఫ్యాన్స్ లో సినీ వర్గాలలో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు