వైరల్ : ఒకే ఫ్రేమ్ లో “గేమ్ చేంజర్స్” ఎం ఎస్ ధోని, రామ్ చరణ్

వైరల్ : ఒకే ఫ్రేమ్ లో “గేమ్ చేంజర్స్” ఎం ఎస్ ధోని, రామ్ చరణ్

Published on Mar 3, 2024 11:59 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రముఖు క్రికెట్ ప్రముఖులు అంతా కూడా ఒకే దగ్గరకి చేరుతున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ ప్రీ వీడింగ్ వేడుకలు కోసం ఇండియా అంతా మాట్లాడుతూ ఉండగా ఈ వేడుకలకి బాలీవుడ్ టాలీవుడ్ సహా క్రికెట్ నుంచి కూడా అనేకమంది దిగ్గజాలు వస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ ఫ్రేమ్ మాత్రం సోషల్ మీడియాలో మరింత అటెన్షన్ తెచ్చుకొని వైరల్ అవుతుంది.

శంకర్ తో “గేమ్ చేంజర్” చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే క్రికెట్ లో గేమ్ చేంజ్ చేసేసే ఎం ఎస్ ధోని లు మళ్ళీ చాలా రోజులు తర్వాత కలిశారు. మరి తాము ఈసారి తమ తమ ఫామిలీస్ తో కలవడం విశేషం. దీంతో ఈ మెగా ఫ్రేమ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. అలాగే వారి అభిమానులు అయితే మరోసారి వీరిని కలిసి చూడడంతో ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చరణ్ మరియు ధోనిలు గతంలో పెప్సీ యాడ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు