వైరల్ : తెలుగు ఆడియెన్స్ కి మృణాల్ ఠాకూర్ పాదాభివందనం

వైరల్ : తెలుగు ఆడియెన్స్ కి మృణాల్ ఠాకూర్ పాదాభివందనం

Published on Apr 3, 2024 7:08 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో రౌడి హీరో విజయ్ దేవరకొండ అలాగే టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం “ఫ్యామిలీ స్టార్” కూడా ఒకటి. దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం పట్ల మేకర్స్ చాలా నమ్మకంగా ఉండగా నిన్ననే గ్రాండ్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో నటి మృణాల్ ఠాకూర్ చేసిన పనికి టాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మృణాల్ కి తన మొదటి సినిమా నుంచే తెలుగు ఆడియెన్స్ లో మంచి ఆదరణ దక్కింది. అది హాయ్ నాన్న తో పెరిగింది.

తనకి ఇంతటి ఆదరణ ప్రేమని ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ కి ఏమి చెప్పలేను అని అందుకే ఇదొక్కటే చేయగలను అంటూ అందరి ముందు స్టేజి పై పాదాభివందనం చేసింది. దీనితో తన నుంచి ఈ బ్యూటిఫుల్ గెశ్చర్ సినీ వర్గాల్లో అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ ఫ్యామిలి స్టార్ చిత్రం ఈ ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు