వైరల్ పిక్ : ప్రచారంలో స్వాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య

వైరల్ పిక్ : ప్రచారంలో స్వాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య

Published on May 1, 2024 3:02 PM IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా బాలయ్య ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చి తాను కూడా ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. దీనితో అభిమానులు తన నుంచి కొన్ని ఎలిమెంట్స్ బాగా మిస్ అవుతున్నారు. అయితే లేటెస్ట్ గా బాలయ్య పిక్ ఒకటి ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ఇస్తుంది.

తన క్యాంపైన్ లోనే తాను కళ్లద్దాలు పెట్టుకుంటున్న పిక్ ఒకటి బయటకి రాగా అందులో బాలయ్య తన స్వాగ్ తో అదరగొట్టేసారు. దీనితో ఈ పిక్ వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఉన్న మూడ్ లో బాలయ్య ఎన్నికల తర్వాతే తన 109వ సినిమా (NBK 109) షూటింగ్ ని రీస్టార్ట్ చేయనున్నట్టు అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుంది అనేది. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు