వైరల్ : రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్ అనన్య సామాన్యం.!

వైరల్ : రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్ అనన్య సామాన్యం.!

Published on Mar 1, 2024 11:00 AM IST

టాలీవుడ్ ప్రైడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ ఫినామినా చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో తెలుగు ఒకటే కాకుండా సినిమా నటులు కూడా గ్లోబల్ లెవెల్లో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరిపై కూడా ఇంటర్నేషనల్ మీడియా కానీ హాలీవుడ్ లో కానీ చర్చ జరిగింది. అయితే లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో మరో ఉదాహరణ కనిపించింది.

హాలీవుడ్ లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఆస్కార్ ఇసాక్, టెనెట్ నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్, అలాగే టాప్ గన్ నటుడు మైల్స్ టెల్లర్ లాంటి నటులతో సహా RRR లో రామ్ చరణ్ పోలీస్ గెటప్ లుక్ కూడా పొందుపరిచారు.

దీనితో తమకి వీరి రేంజ్ ఫిజిక్ మరియు లుక్స్ ఉన్న నటులు కావాలని అందుకు పోస్ట్ చేసారు. దీనితో ఈ పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసాక చరణ్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ గ్లోబల్ గా ఈ రేంజ్ రీచ్ ని అందుకున్నందుకు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో చరణ్ గ్లోబల్ ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయో లేదో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు