వైరల్ : తన పెళ్లి జ్ఞాపకానికి కొత్త హంగులు దిద్దిన సమంత

వైరల్ : తన పెళ్లి జ్ఞాపకానికి కొత్త హంగులు దిద్దిన సమంత

Published on Apr 26, 2024 2:01 PM IST


ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత తన సినిమాలు వెబ్ సిరీస్ లకి కూడా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరిగా “ఖుషి” సినిమాలో కనిపించి అలరించిన సమంత తర్వాత తన అవైటెడ్ వెబ్ సిరీస్ “సిటాడెల్” సంబంధించి ప్రైమ్ వీడియో ఈవెంట్ లో సందడి చేసింది. అయితే సమంత పర్శనల్ లైఫ్ సంబంధించి కూడా కొన్ని అంశాలు అందరికీ తెలిసిందే.

మరి దీని సంబంధించి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారింది. సమంత తన జీవితంలో ఒక మెమొరబుల్ మూమెంట్స్ లో తన పెళ్లి కూడా ఒకటి. తన మాజీ భర్త ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్యతో జరిగిన వివాహంలో ఆమె ధరించిన ఓ ప్రత్యేకమైన గౌన్ కోసం ఇప్పుడు వార్తలు వైరల్ గా మారాయి.

సమంత నుంచి లేటెస్ట్ పిక్స్ బయటకి రాగా దీనితో పాటుగా ఓ వీడియో కూడా వచ్చింది. అయితే ఇందులో సమంత కాస్ట్యూమ్ డిజైనర్ క్రెషా బజాజ్ 2016లో సమంత పెళ్లి నాటి గౌన్ ని మళ్ళీ కొత్తగా రీ డిజైన్ చేశారు. తెల్లగా ఉన్న ఆ గౌన్ ని కొత్త హంగులతో డిజైన్ చేయించి సమంత ధరించింది. దీనితో అప్పటి పెళ్లి బట్టలు ఇంకా ఉంచి మళ్ళీ ఇలా డిజైన్ చేయించడం వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు