వైరల్ వీడియో : ‘పుష్ప’ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన రణ్వీర్ సింగ్, దేవిశ్రీప్రసాద్

వైరల్ వీడియో : ‘పుష్ప’ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన రణ్వీర్ సింగ్, దేవిశ్రీప్రసాద్

Published on Apr 30, 2024 1:10 AM IST

పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు అందులో సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అందులో సమంత తో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్ అదరగొట్టిన ఊ అంటావా మావ సాంగ్ అయితే యువత, మాస్ ఆడియన్స్ ని ఎంతో అలరించింది.

విషయం ఏమిటంటే, తాజాగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రెసెప్షన్ కి విచ్చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరియు బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇద్దరూ కూడా ఊ అంటావా మావ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టారు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా దేవిశ్రీ ఆ వీడియో చేయగా వారిద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు