‘రానా’ బర్త్ డేకి ‘విరాట పర్వం’ నుండి గిఫ్ట్ !

‘రానా’ బర్త్ డేకి ‘విరాట పర్వం’ నుండి గిఫ్ట్ !

Published on Dec 14, 2019 9:14 AM IST

రానా 35వ పుట్టినరోజు సందర్భంగా, తాజాగా ఆయన నటిస్తోన్న పీరియాడిక్ సోషల్ డ్రామా ‘విరాటా పర్వం’ నుండి చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేసింది. రానా పేస్ ఎర్రటి కండువాతో కప్పబడి ఉండటంతో పోస్టర్ లో మాస్ అప్పీల్ బాగా హైలైట్ అవుతుంది. రానా గెటప్ చూస్తుంటే.. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా నటించబోతున్నాడని అర్ధం అవుతుంది. పోస్టర్ బ్యాగ్రౌండ్ లో పోలీసులు ఛార్జ్ చేస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఆ రోజుల్లో తెలుగు రాష్టాల్లో చోటు చేసుకున్న కొన్ని కీలక అంశాలతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత సమస్య మరియు ఏక్తా యాత్ర నిరసన గురించి ఈ సినిమాలో ఉంటాయట. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు