“కేజీయఫ్ 2” ఎఫెక్ట్ సెహ్వాగ్ వరకు వెళ్ళిందే.!

“కేజీయఫ్ 2” ఎఫెక్ట్ సెహ్వాగ్ వరకు వెళ్ళిందే.!

Published on Feb 19, 2021 12:00 PM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా కూడా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అయినటువంటి “కేజీయఫ్ చాప్టర్ 2” కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే వచ్చిన టీజర్ తో అయితే ప్రకంపనలే సృష్టించారు. మరి ఈ చిత్రం ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో మరో సారి ఇప్పుడు నిరూపితం అయ్యిందని చెప్పాలి.

మన ఇండియన్ మాస్ అండ్ డాషింగ్ బ్యాట్సమెన్ వీరేంద్ర సెహ్వాగ్ మహారవీరుడు ఛత్రపతి మహారాజ్ ను ఉద్దేశించి పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అంతలా ఎందుకు అంటేఛత్రపతి శివాజీకు నివాళులు అర్పిస్తూ సెహ్వాగ్ ఈ “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ లో ఒక్కొక్కరికి గూస్ బంప్స్ ఇచ్చిన పవర్ ఫుల్ పీపుల్ అండ్ హిస్టరీ కోసం చెప్పే డైలాగ్ ఉంటుంది.

దానిని మొత్తం ఛత్రపతి శివాజీని ఉద్దేశించి పెట్టి మరింత హైప్ తెచ్చారు. దీనితో కేజీయఫ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని యష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రం ఈ జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు