విరూపాక్ష డైరెక్టర్ తో నాగ చైతన్య?

విరూపాక్ష డైరెక్టర్ తో నాగ చైతన్య?

Published on Mar 26, 2024 7:24 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ చైతన్య చేస్తున్న ఈ క్రేజ్ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

విరూపాక్ష చిత్రం తో సూపర్ హిట్ సాధించిన కార్తిక్ వర్మ దండు దర్శకత్వం లో నాగ చైతన్య ఒక చిత్రం చేయనున్నారు. కంప్లీట్ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుబోయే ఈ చిత్రం ను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు