వరుడు, లియో చిత్రాల్లో ఆ రోల్స్ రిజెక్ట్ చేయడం పై క్లారిటీ ఇచ్చిన విశాల్!

వరుడు, లియో చిత్రాల్లో ఆ రోల్స్ రిజెక్ట్ చేయడం పై క్లారిటీ ఇచ్చిన విశాల్!

Published on Apr 18, 2024 9:01 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ లలో విశాల్ ఒకరు. ఈ హీరో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తదుపరి డైరెక్టర్ హరి డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం లో కనిపించనున్నారు. ప్రియా భవాని శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 26, 2024 న వరల్డ్ వైడ్ గా తమిళ బాషలో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ హీరో, తను రిజెక్ట్ చేసిన పాత్రల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన వరుడు మూవీ లో ఆర్య రోల్ కోసం మొదట తనను సంప్రదించిన విషయాన్ని వెల్లడించారు. డేట్స్ అడ్జెస్ట్ అవ్వక పోవడం తో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా విజయ్ టైటిల్ రోల్ లో నటించిన లియో లో హీరో అర్జున్ రోల్ కోసం కూడా తనను సంప్రదించగా, సేమ్ రీజన్ తో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు