‘పందెం కోడి’ ఫేం విశాల్ తమిళంలో మరో కొత్త సినిమాకి సైన్ చేశాడు. నటి ఖుష్బూ భర్త సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. ‘అంబాలా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విశాల్ సరసన తొలిసారిగా హన్సిక నటిస్తుంది. తమిళ ప్రేక్షకులు ముద్దుగా జూనియర్ ఖుష్బూ అని పిలుచుకునే హన్సిక సుందర్ సి దర్శకత్వంలో నటిస్తున్న 3వ సినిమా ఇది.
విశాల్, సుందర్ సి కాంబినేషన్లో గతంలో ‘మధ గజ రాజా’ సినిమా రూపొందింది. తెలుగులో ‘నట రాజ తానె’గా అనువాదం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ సినిమా ఇంకా తెలుగు, తమిళ భాషలలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా తెరకేక్కడం చూసి కోలీవుడ్ వర్గాలు అర్చర్యపోతున్నాయి. ‘అంబాలా’ చిత్రాన్ని విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.


