2005లో విడుదలైన ‘పందెం కోడి’ సినిమా తెలుగు, తమిళ భాషలలో హీరో విశాల్ కు మంచి పేరు తీసుకొచ్చింది. యాక్షన్ హీరో ఇమేజ్ ను కట్టబెట్టింది. ఈ సినిమాతోనే విశాల్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ‘పందెం కోడి’ సినిమాకు సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెన్నై మీడియా టాక్.
లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు హీరో విశాల్ ప్రకటించారు. ప్రస్తుతం కమిట్ అయిన రెండు సినిమాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత లింగుస్వామి సినిమా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త కథతో సినిమా చేస్తున్నారా..? లేక ‘పందెం కోడి’ సీక్వెలా..? అనే విషయం చెప్పలేదు.
సూర్య నటించిన ‘అంజాన్’ (తెలుగులో సికందర్ గా విడుదలయింది) తో లింగుస్వామి పరాజయం చవిచూశారు. ఇప్పుడు హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. సూర్య తమ్ముడు కార్తితో మరొక సినిమా చేయడానికి అంగీకరించారు.


