తానే దర్శకుడినని ప్రకటించేసిన విశాల్

Published on Mar 11, 2020 11:47 pm IST

విశాల్ ఈమధ్య మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్ 2’ చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే సినిమా కొంత భాగం చిత్రీకరణ జరిగాక విశాల్, మిస్కిన్ మధ్య విభేదాలు తలెత్తడంతో మిస్కిన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో విశాల్ మిగతా భాగాన్ని షూట్ చేస్తారని వార్తలొచ్చాయి.

అయితే కొన్ని రోజుల క్రితం విశాల్, మిస్కిన్ మధ్య సయోధ్యకు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో మిస్కిన్ విశాల్ ముందు అనేక కండిషన్లతో కూడిన అగ్రిమెంట్ ఉంచడం జరిగింది. కానీ విశాల్ మాత్రం వాటికి ఒప్పుకోలేదు. అసలు దర్శకుడు విదేశాల్లో స్క్రిప్ట్ రాసుకోవడానికి నిర్మాత లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి, కేవలం 3,4 గంటల షూటింగ్ కోసం రూ.15 లక్షలు ఎలా ఖర్చుపెట్టిస్తారు, సరైన ప్లానింగ్ లేకుండా డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేస్తే నిర్మాతగా తాను ఎంతో నష్టపోతానని ఎదురు ప్రశ్నలు సంధించారు.

ఇది కేవలం తనొక్కడి సమస్య కాదని, అందరి నిర్మాతల సమస్యని అంటూ తన వద్ద సినిమా తీయడానికి డబ్బు లేదనే మాట నిజం కాదని, కానీ అనవసరంగా నష్టపోవడానికి తాను సిద్దంగా లేనని చెబుతూ ‘తుప్పరివాలన్ 2’ మిగతా భాగాన్ని తానే డైరెక్ట్ చేస్తానని అధికారికంగా ప్రకటించేశారు.

సంబంధిత సమాచారం :