ఓటిటి డేట్ లాక్ చేసుకున్న విశాల్ కెరీర్ బిగ్ డిజాస్టర్.. ఎప్పుడు, ఎందులో అంటే!

ఓటిటి డేట్ లాక్ చేసుకున్న విశాల్ కెరీర్ బిగ్ డిజాస్టర్.. ఎప్పుడు, ఎందులో అంటే!

Published on Sep 10, 2026 5:00 PM IST

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కి కూడా ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు కూడా మంచి సినిమా పడితే వసూళ్లు బాగానే వస్తాయి కానీ ఈ మధ్య మాత్రం మంచి కంటెంట్ పట్టుకోవడం విశాల్ విఫలం అవుతున్నాడు. అయితే ఆఖరికి తానే దర్శకునిగా కూడా మారి చేసిన తొలి సినిమానే డిజాస్టర్ అయ్యి దెబ్బ కొట్టింది. ఆ చిత్రమే ‘మకుటం’.

తానే హీరోగా, దర్శకునిగా కూడా చేసిన ఈ చిత్రం థియేటర్స్ లో తన కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్, క్లోజింగ్ తో ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలీని విధంగా మారిపోయింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం రేపు సెప్టెంబర్ 11 నుంచి అందుబాటులోకి రానుంది.

సో అప్పుడు సినిమా టాక్ విని కూడా చూడడం మిస్ అయ్యాము అనుకుంటే ఇపుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో అంజలి, దుశర విజయన్ లు హీరోయిన్గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అలాగే విశాల్, ఆర్బీ చౌదరి నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు