మొత్తానికి నీల్, మైత్రి మూవీస్ హారర్ థ్రిల్లర్ కి సెన్సార్ క్లియర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది

మొత్తానికి నీల్, మైత్రి మూవీస్ హారర్ థ్రిల్లర్ కి సెన్సార్ క్లియర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది

Published on Sep 10, 2026 12:00 PM IST

సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో చేస్తున్న సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ‘418’. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సెన్సార్ పనులు కానందున చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో ఉన్న షాకింగ్ కంటెంట్ మూలానే సెన్సార్ ఆలస్యం అయినట్టు కూడా టాక్ వినిపించింది.

కానీ ఫైనల్ గా ఈ సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. సెన్సార్ యూనిట్ వారు ఏ రేటింగ్ ని ఈ చిత్రానికి ముట్టజెప్పి ఆడియెన్స్ ని హెచ్చరించారు. ఒక నెవర్ బిఫోర్ హారర్ థ్రిల్లర్ ని నీల్ మరియు మైత్రి సంస్థ తెస్తున్నట్టుగా టాక్. ఇక దీనితోనే రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇచ్చేసారు.

ఈ సెప్టెంబర్ 18న థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేయనుంది. ఇక ఈ చిత్రానికి కీర్తన్ నందగౌడ దర్శకత్వం వహించగా సూర్య రాజ్, చరణ్ లక్కరాజు అలాగే ప్రీతీ పగడాల ముఖ్య పాత్రల్లో నటించారు. సో ఈ చిత్రం ఏమేరకు థ్రిల్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు