విశాల్ దర్శకుడిగా మారడం కన్ఫర్మ్ !

విశాల్ దర్శకుడిగా మారడం కన్ఫర్మ్ !

Published on Nov 9, 2018 12:01 AM IST

Vishal

ఏడాది కి రెండు లేదా మూడు సినిమాలు చేసుకుంటూ బిజీ గా వుండే యాక్షన్ హీరో విశాల్ త్వరలోనే డైరక్టర్ అవతారం ఎత్తనున్నాడు. ఆయన డాగ్స్ మీద ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నాడు. ఇక సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కానుందట.

ఇక విశాల్ ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ ను ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆయన ఈ చిత్రం తో పాటు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో తమన్నా తో కలిసి నటించనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు