మే చివరి వారంలో రానున్న విశాల్ !
Published on May 17, 2018 12:55 am IST

హీరో ‘విశాల్, సమంత’ జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంఫై పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన సినిమా ‘ఇరుంబు తెరై’ ఇటీవల తమిళనాడు లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఈ చిత్రాన్ని జి. హరి’ అభిమన్యుడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సైబర్ యుద్ధం మరియు డేటా దొంగతనం నేపథ్యం లో సాగే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ ‘అర్జున్’ కీలక పాత్రలో నటించారు.

ఈ చిత్రం సెన్సార్ ని పూర్తి చూసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. మే చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook