నాన్ థియేట్రికల్ పార్టనర్స్ ను ఫిక్స్ చేసుకున్న విశాల్ “రత్నం”

నాన్ థియేట్రికల్ పార్టనర్స్ ను ఫిక్స్ చేసుకున్న విశాల్ “రత్నం”

Published on Apr 15, 2024 10:55 AM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విశాల్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరి డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం. ఏప్రిల్ 26, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్ పార్టనర్స్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో సినిమా యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది.

అదే విధంగా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ టీవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నేడు ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సాయంత్రం 5:00 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సముద్రఖని, యోగిబాబు, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్‌లపై కార్తెకేన్ సంతానం మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు