ఒకేరోజు 3 సినిమాలు ఒక వెబ్ సిరీస్‌ మొదలెట్టాడుగా !

ఒకేరోజు 3 సినిమాలు ఒక వెబ్ సిరీస్‌ మొదలెట్టాడుగా !

Published on Jul 7, 2019 6:27 PM IST

గత కొంతకాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణు మొత్తానికి కెరీర్ ను పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సారి ఏకంగా మూడు యాక్ష‌న్ డ్రామా చిత్రాల‌తో పాటు ఓ వెబ్ సిరీస్‌ తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. వాటిల్లో రెండు ఫిల్మ్స్ లో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా.. మరో చిత్రానికి మరియు వెబ్ సిరీస్‌ కి నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే విష్ణు హీరోగా నటిస్తున్న రెండు చిత్రాల్లో ఓ హాలీవుడ్ చిత్రం ఉండటం విశేషం. కాగా ఈ రోజు త‌న ప్రొడ‌క్ష‌న్ ఆఫీస్‌ లో మూడు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ను లాంఛ‌నంగా ప్రారంభించారు.

విష్ణు హీరోగా నటిస్తోన్న హాలీవుడ్ చిత్రాన్ని జెఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు మంచు సరసన కాజ‌ల్ హీరోయిన్ గా ఈ యాక్ష‌న్ డ్రామా కోసం విష్ణు స‌తీమ‌ణి విరానికా నిర్మాత‌గా కూడా మారారు. వ‌యా మార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ నిర్మాణ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మించ‌నున్నాయి. ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ యాక్ట‌ర్ ఈ చిత్రంలో న‌టించ‌నున్నారు. మిగ‌తా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేనున్నారు.

ఇక సుబ్బరాజు అనే కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ మూవీని నిర్మించ‌నున్నారు మంచు విష్ణు. ఈ చిత్రానికి మిరా రోడ్‌ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌క ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లోని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొంద‌బోయే పొలిటిక‌ల్ డ్రామా వెబ్‌ సిరీస్‌ ను విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ తో రాజ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు