కరోనా వీరుల పై మంచు విష్ణు ప్రశంసలు !

కరోనా వీరుల పై మంచు విష్ణు ప్రశంసలు !

Published on Apr 26, 2020 11:15 PM IST

vishnu manchu
కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో, మహమ్మారి మన దరికి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బంది మరియు పోలీసులు సూచనలు ఇస్తుంటే.. కొంతమంది వారి పై కూడా దాడులు చేసిన సంఘటనలను కూడా మనం విన్నాం. కాగా అలాంటి సంఘటనల పై తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ… ‘ఈ కరోనా కష్టకాలంలో మన ఆరోగ్యం కోసం మన ప్రాణాల కోసం కష్టపడుతున్న వైద్య సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పై వాదులాడంతో పాటు కొన్ని చోట్ల దాడి చేసిన దురదృష్టకరమైన వార్తలు కూడా ఇటీవలే వచ్చాయి. మన కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తోన్న వైద్య మరియు పోలీస్ సిబ్బంది పట్ల మనం ఎంతో కరుణతో ,ఎంతో కృతజ్ఞత చూపించాలి, వాళ్ళు వారి ఇళ్లకు, కుటుంబాలకు దూరంగా ఉండి, మనల్ని కాపాడటానికి ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారు. వారిని మనము ఎంతో గౌరవించాలి’ అని మంచు విష్ణు తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని.. సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపటానికి ఈ ఖాళీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ జూన్ లో వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు