విశ్వక్ సేన్ 12 టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్, టైం ఫిక్స్

విశ్వక్ సేన్ 12 టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్, టైం ఫిక్స్

Published on Mar 28, 2024 11:01 PM IST

యువ నటుడు విశ్వక్ సేన్ ఇటీవల గామి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక త్వరలో ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా రేపు ఆయన కెరీర్ 12వ మూవీ యొక్క టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు.

విశ్వక్ బర్త్ డే రేపు కావడంతో ఈ స్పెషల్ డే సందర్భంగా షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు సాయంత్రం 4 గం. 5 ని. లకు రానుంది. ఆమె వరల్డ్ ని రేపు పరిచయం చేయనున్నాం అంటూ ఇంట్రెస్టింగ్ గా మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు రేపటి టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రివీల్ కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు