టీజర్ టాక్: వైలెన్స్ తో ‘కల్ట్’ చూపిస్తున్న విశ్వక్ సేన్!

cult 3

మన టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా విశ్వక్ సేన్ దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్న మోస్ట్ వైలెంట్ చిత్రమే “కల్ట్”. పోస్టర్స్ తోనే మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా నుంచి ఊహించని విధంగా ఆర్ రేటెడ్ టీజర్ అంటూ ఇండియన్ సినిమా దగ్గర రేర్ అటెంప్ట్ ని చేస్తున్నట్టు తెలిపారు.

ఇక ఫైనల్ గా ఈ సినిమా తాలూకా టీజర్ వచ్చేసింది. మరి ఇందులో సెటప్ అంతా ముందు చాలా సరదాగా సాగినప్పటికీ ఒక పార్టీ లోకి వెళ్లిన తర్వాత స్టార్ట్ అయ్యింది అసలు కల్ట్ అంతా. పార్టీలోకి వెళ్లిన వారు అంతా అకస్మాత్తుగా భయానక విధమైన రీతిలో చనిపోతూ ఉండడం ఇక ఆ మూడ్ లో ఎంటర్ అయ్యిన విశ్వక్ సేన్ తన షో చూపించాడు.

యాక్షన్, బ్లడ్ బాత్ తో పాన్ వరల్డ్ ఆడియెన్స్ కి కల్ట్ చూపించేందుకు సిద్ధం అయ్యాడు. ఇక ఇందులో రవి బాసృర్ సంగీతం కూడా డీసెంట్ గానే ఉంది. అరవింద్ విశ్వనాథన్ కెమెరా వర్క్ కూడా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జాపనీస్ అలాగే స్పానిష్ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ ఎప్పుడు అనేది నిర్మాత సందీప్ కాకర్ల ప్రకటించాల్సి ఉంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version