ట్రైలర్ తో సాలిడ్ హైప్ అందుకున్న విశ్వక్ సేన్.!

ట్రైలర్ తో సాలిడ్ హైప్ అందుకున్న విశ్వక్ సేన్.!

Published on May 26, 2024 7:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ రూరల్ డ్రామా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. మరి ఈ సినిమా విషయంలో ముందు నుంచీ మంచి బజ్ ఉంది. పాటలు కూడా హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీటి అన్నిటినీ మించి ట్రైలర్ అదరగొట్టింది అని చెప్పాలి.

చాలా వరకు అయితే ఎవరూ ట్రైలర్ ని ఈ రేంజ్ లో ఊహించి ఉండకపోవచ్చు దీనితో మిడ్ రేంజ్ చిత్రాల్లో చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో సాలిడ్ హిట్ పడబోతుంది అని అర్ధం అవుతుంది. మరి ట్రైలర్ ఊపులోనే సినిమా కూడా ఉంటే మాత్రం విశ్వక్ సేన్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా కూడా ఇది నిలిచేందుకు అవకాశాలు లేకపోలేదు. మరి చూడాలి ఈ సినిమా ఇలాంటి సక్సెస్ ని అందుకుంటుందో అని. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు