ఆయన వల్ల నా కళ్లల్లో నీళ్లొచ్చాయి – విశ్వక్ సేన్

ఆయన వల్ల నా కళ్లల్లో నీళ్లొచ్చాయి – విశ్వక్ సేన్

Published on May 29, 2024 10:02 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నేహాశెట్టి, అంజలి కథానాయికలు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదలకి ముందస్తు వేడుకను ఘనంగా నిర్వహించారు.

కాగా ఈ వేడుకలో విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ విష్వక్‌ సేన్‌ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం ఫైట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు రోడ్డుపైన పడిపోయాను. దేవుడి దయవల్ల నాకు ఏమీ కాలేదు కానీ, ఆ సమయంలో నాకేమైందని చాలామంది టెన్షన్‌ పడ్డారు. ఐతే, నాకు దెబ్బ తగిలిందని తెలిసి బాలయ్య సర్‌ ఫోన్‌ చేసి మాట్లాడినప్పుడు నా కళ్లల్లో నీళ్లొచ్చాయి. కుటుంబం తర్వాత ఆయన అంత ప్రేమ చూపించారు’ అని విష్వక్‌ సేన్‌ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు