విశ్వక్సేన్ ‘గామి’ ట్రైలర్ రన్ టైం లాక్

విశ్వక్సేన్ ‘గామి’ ట్రైలర్ రన్ టైం లాక్

Published on Feb 29, 2024 4:01 PM IST

యువ నటుడు విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ గామి ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచింది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎం.జి.అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెదాడ కీలక పాత్రలు పోషించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌ పై కార్తీక్ శబరీష్ గ్రాండ్ గా నిర్మించారు.

ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని పంచేందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్ పై గామి థియేట్రికల్ ట్రైలర్ ను నేడు విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక గెస్ట్ గా విచ్చేసి ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా గామి ట్రైలర్ రన్ టైం లాక్ అయింది. ఈ ట్రైలర్ 3 ని. 43 సెకండ్స్ నిడివితో థ్రిల్లింగ్ విజువల్ వండర్ గా సాగనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ని సాయంత్రం 6 గం. 3 ని. లకు రిలీజ్ చేయనున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి గామి మూవీని మార్చి 8న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు