మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?

మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?

Published on Aug 23, 2026 12:00 PM IST

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘కాకా’ గ్లింప్స్’ రూపంలో మంచి ట్రీట్ అందింది. పైగా కాకా చిత్రాన్ని 2027 జనవరి 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే, ‘విశ్వంభర’ సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. వాస్తవానికి ఈ చిత్రం 2025 జనవరిలో విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. ఆ తర్వాత కూడా రిలీజ్ పై చాలా రూమర్స్ వినిపించాయి. కానీ, విడుదల తేదీ పై క్లారిటీ లేదు.

ఐతే, చిరు పుట్టినరోజు ప్రత్యేక సందర్భంలో అయినా ఈ సినిమా విడుదల తేదీ పై ప్రకటన వస్తోందని ఆసక్తిగా ఎదురుచూసిన మెగా అభిమానులకు మళ్లీ నిరాశను కలిగించింది. 2026 అక్టోబర్ 16న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది, అయినప్పటికీ, చిత్ర బృందం తాజాగా ఇచ్చిన ప్రచార అప్‌డేట్‌లో దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. మరి ‘విశ్వంభర’ కోసం మెగా ఫ్యాన్స్ ఇంకా ఎన్నాళ్ళు ఎదురుచూడాలో.

దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతుంది ఈ చిత్రం. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు