హాట్ టాపిక్ గా “విశ్వంభర” హీరోయిన్ పారితోషికం.!

హాట్ టాపిక్ గా “విశ్వంభర” హీరోయిన్ పారితోషికం.!

Published on Mar 29, 2024 9:16 PM IST

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో మరోసారి భారీ ఆఫర్లుతో దూసుకెళ్తున్న నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కూడా ఒకరు. మరి టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో “విశ్వంభర” (Vishwambhara) అనే భారీ చిత్రంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉండగా మరో పక్క ఈ చిత్రంతో పాటుగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో ఆమె “థగ్ లైఫ్” (Thug Life) అనే సినిమా చేస్తుంది. మరి ఈ చిత్రం విషయంలోనే ఆమె పై కొన్ని వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ఈమె సౌత్ ఇండియా లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచిందట. అయితే ఆ చిత్రం కోసం ఆమె ఏకంగా 12 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి. ఇక మెగాస్టార్ “విశ్వంభర” చిత్రాన్ని యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా “థగ్ లైఫ్” చిత్రాన్ని లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు