‘విశ్వంభర’: అప్పటి మెగా హిట్ మూవీ పంథాలోనే ?

‘విశ్వంభర’: అప్పటి మెగా హిట్ మూవీ పంథాలోనే ?

Published on Feb 22, 2024 2:02 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోన్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీలో దొరబాబు పాత్రలో కనిపించనున్న మెగాస్టార్ కు ఐదుగురు అక్కచెల్లెల్లు ఉంటారని, వారి పాత్రల కోసం ఇప్పటికే టీమ్ పలువురు నటీమణుల ఎంపిక ప్రారంభించిందని అంటున్నారు.

అలానే మూవీలో మంచి సెంటిమెంట్, ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక గతంలో మెగాస్టార్ మెగా హిట్ మూవీ హిట్లర్ లో కూడా ఆయన ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా కనిపించి ఆకట్టుకున్నారు. విశ్వంభర మూవీ భీమవరం దగ్గరిలోని ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా భారీ స్థాయి సెట్టింగ్స్ అలానే విజువల్ ఎఫెక్ట్స్ కోసం టీమ్ బాగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు