‘విశ్వంభర’ : మెగాస్టార్, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబో పై అందరిలో ఆసక్తి

‘విశ్వంభర’ : మెగాస్టార్, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబో పై అందరిలో ఆసక్తి

Published on Mar 29, 2024 12:04 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని, చోటా కె నాయుడు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ అయితే టాలీవుడ్ ఆడియన్స్ లో బజ్ గా మారింది.

వాస్తవానికి మెగాస్టార్ తో కలిసి సంగీత దర్శకుడు కీరవాణి గతంలో అనేక సక్సెస్ఫుల్ మూవీస్ కి వర్క్ చేసారు. అయితే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో చాలా ఏళ్ళ తరువాత ఈ మూవీ వస్తుండడంతో సాంగ్స్ ఎలా ఉంటాయో వినాలని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక విశ్వంభర కోసం కీరవాణి కూడా ఎంతో కష్టపడుతున్నారని, సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా అదిరిపోయేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు