మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష అలాగే ఆషిక రంగనాథ్ లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ ఫాంటసీ విజువల్ ట్రీట్ చిత్రం ‘విశ్వంభర’ కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడో గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యిన సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా అలా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఈ ఆలస్యానికి ఉన్న పలు కారణాల్లో సినిమా సీజీ వర్క్ తో పాటుగా ఓటిటి డీల్ కాకపోవడం అన్నట్టు కూడా టాక్ ఉంది. అందుకే డేట్ ని మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఫైనల్ గా విశ్వంభర ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. పాపులర్ ఓటిటి సంస్థ సోనీ లివ్ వారు ఫ్రంట్ రేస్ లో ఉన్నట్టుగా టాక్. దాదాపు వీరే ఫైనల్ అవుతారని తెలుస్తుంది.
ఒక్కసారి డీల్ పూర్తయ్యాక సినిమా విడుదల ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారట. మరి ఈ అనౌన్సమెంట్ ఎప్పుడు ఏంటి అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.


