‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మరో రేర్ రికార్డ్.. 25 రోజుల్లోనే ఏకంగా రూ.260 కోట్ల కలెక్షన్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మరో రేర్ రికార్డ్.. 25 రోజుల్లోనే ఏకంగా రూ.260 కోట్ల కలెక్షన్స్

Published on Sep 7, 2026 11:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన 25 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

సూర్య మార్కెట్ స్టామినాను మరోసారి చాటిచెబుతూ, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.

రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. 25 రోజులు పూర్తయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గకుండా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు